నేడు డొక్కా సీతక్క మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిలతో మంత్రి లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. "విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైన దశ. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు ఇప్పటి నుంచే దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ కనిపించినా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయండి. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నాం. మీరంతా బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలి. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నాం. మీలో ఒక్కడిగా నన్నూ భావించి ఏం చేస్తే బాగుంటుందో సలహాలు సూచనలు ఇవ్వండి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని" చెప్పారు.