అమ్మలాంటి మాతృభాషను గత ప్రభుత్వం అవమానపరిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృభాషకు చంద్రబాబు హయాంలో సముచిత గౌరవం లభించిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు భాష పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతోందని తెలిపారు. సామాన్య ప్రజలు, పల్లెల్లో ప్రజానీకం అన్ని విషయాలు తెలుసుకునే విధంగా పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.