‘తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మాట్లాడేటప్పుడు కంట్రోల్‌లో ఉండాలి. మీడియా అటెన్షన్ కోసం ఏదేదో మాట్లాడటం సరైన పద్ధతికాదు’ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘జేసీ టీడీపీ అధికార ప్రతినిధి అవునో కాదో తెలీదు. ఆయన ఎందుకు ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాడో తెలీదు. ఆయన అటువంటి భాషను ప్రయోగించడం మంచిది కాదు. ఆయన వయస్సుకు అస్సలు మంచిది కాదు. బీజేపీ ప్రభుత్వం తమ బస్సులను కాల్చిందని ఆరోపించడం విడ్డూరంగా ఉంది. జేసీ ప్రభాకరరెడ్డికి మాజీ సీఎం జగన్‌పై ప్రేమ ఉంటే వెళ్లి ఆయన పంచన చేరమనండి. ఎవరు ఏం దుస్తులు ధరించాలి? ఎవరు ఏం మాట్లాడాలో ఆయన నిర్ణయిస్తే ఎట్లా? వివాదాల్లోకి వెళ్లడం ఆయనకు అలవాటుకానీ మాకు లేదు’ అని మంత్రి అన్నారు.