కాకరకాయ జ్యూస్ అనుకుని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందారు. భీమిలి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న ముస్తఫాకు షుగర్ వ్యాధి ఉంది. రోజూ కాకరకాయ జ్యూస్ తాగేవాడు. బుధవారం ఉదయం మొక్కలకు పిచికారి చేసేందుకు పురుగుల మందు తీసుకువచ్చి గ్లాస్‌లో ఉంచాడు. జ్యూస్ తాగిన తర్వాత పిచికారీ చేద్దామని పక్కన పెట్టాడు. కాసేపు తరువాత పొరపాటున పురుగుల మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు.