భవనంపై నుంచి పడి వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన పుంగనూరులో చోటు చేసుకుంది. పుంగనూరు పట్టణం మార్కెట్ యార్డ్ సమీపములో నివాసమున్న అబ్దుల్ రహీం కూరగాయలు, పాత ఇనుము వ్యాపారం తదితర వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. బుధవారం అబ్దుల్ రహీం ( 48 ) ఓ భవనంపై నుంచి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.