|
|
by Suryaa Desk | Sat, Dec 09, 2023, 01:48 PM
యూపీఏ మాజీ చైర్మన్ అఖిలభారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను గార్ల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్య నిర్వాహక కమిటీ అధ్యక్షుడు తాళ్ళపల్లి కృష్ణగౌడ్, జాతీయ శ్రీశక్తి అవార్డు గ్రహీత షంసద్ బేగం, మాజీ ఎంపీపీ ఎంపీటీసీ మలోత్ వెంకట్ లాల్ గార్ల ఆధ్వర్యంలో స్థానిక గార్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వారి చిత్రపటానికి గార్ల పట్టణ ఎంపిటిసి సభ్యులు సుజాత రామారావు పాలాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంచి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ప్రముఖ వైద్యులు గుగులోత్ బాలు నాయక్, డాక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా రోగులకు పాలు పండ్లు లను అందజేశారు.