|
|
by Suryaa Desk | Thu, Dec 19, 2024, 04:56 PM
చిన్ననాటి నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బావ జాలం ఉన్న వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో చిత్రలేఖనం ఆటల పోటీలు తన సొంత ఖర్చులతో విద్యార్థులకు ప్రోత్సాహాన్ని కల్పిస్తూ దశాదిశా చేస్తూ నాటి బాలలే రేపటి బావి భారతపౌరులు అని దేవరకొండ మండల స్థాయిలో విద్యార్థులకు విద్యాపరంగా క్రీడలపరంగా అవగాహన కల్పిస్తూ సమ సమాజం స్థాపన కోసం మంచి మార్గంలో నడవాలి పదిమందికి ఉపయోగపడుతూ తమరి యొక్క స్వయం.
శక్తితో పట్టుదలతో విద్యలో నైపుణ్యం సాధించి గొప్ప వ్యక్తులుగా కీర్తించాలని టైగర్ జీవ చేసిన సేవలను గుర్తిస్తూ జాతీయ బహుజన సాహిత్య అకాడమీ వారు ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ డిసెంబర్ 15వ తేదీన న్యూఢిల్లీ గోదావరి ఆడిటోరియం నందు జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవ రత్న అవార్డును బహూకరించడం జరిగింది. ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగిందని క్రమశిక్షణతో సమాజానికి విద్యార్థులకు మరిన్ని సేవలు అందిస్తానని టైగర్ జీవ తెలిపారు.