|
|
by Suryaa Desk | Thu, Dec 19, 2024, 04:49 PM
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే సహించేది లేదని మాలమనాడు నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ యేకుల రాజారావు, నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షుడు బోయిని చంద్రమౌళి అన్నారు. దేవరకొండలో జరిగిన మాలమనాడు దేవరకొండ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎస్సీ ఎకసభ్య కమిషన్ రిపోర్టు రాకముందే, ఇటివల మాదిగల మీటింగ్ లో పాల్గోని,మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఎస్సి రిజర్వేషన్లు ఇరువై ఐదు శాతంపెంచకుండా,ప్రైయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దళితుల ఐక్యతను దేబ్బతీస్తున్న బిజెపి మోడీ ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా లక్షల మందితో నేడు చలో అసెంబ్లీ ముట్టడికి పిలిపిస్తున్నట్లు వారు పిలుపునిచ్చారు . వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామని, అది తీర్పు కాదు సూచన మాత్రమేనని వారు అన్నారు. వర్గీకరణ వ్యతిరేకంగా పార్లమెంట్లో చర్చలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు డివిజన్ కార్యదర్శి మేడ సైదులు, దళిత రత్న అవార్డు గ్రహీత నూనె సురేష్, నంది వెంకటయ్య, వేంకటేష్,చేపూరి మురళి తదితరులు పాల్గొన్నారు.