by Suryaa Desk | Fri, Dec 20, 2024, 04:21 PM
తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేదే భూమి అని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చెప్పారు. ధరణికి ప్రత్యామ్న్యాయంగా తీసుకువస్తున్న భూభారతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 'భూమిలేని పేదలకు ఇందిరా సర్కార్ భూమిచ్చింది. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయి. కానీ BRS ప్రభుత్వం తెచ్చిన ధరణి మాత్రం అన్నదాతలను తమ భూములకు దూరం చేసింది' అని ఆరోపించారు.