by Suryaa Desk | Fri, Dec 20, 2024, 08:49 PM
నాకు జోగిపేటలోని బాలికల గురుకుల పాఠశాలలో బోజనం చాలా బాగా నచ్చిందని, అన్నీ రుచికరంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం జోగిపేట మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన బోజనాన్ని ప్రతి రోజు అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. ప్రభుత్వం ఇటీవల గురుకుల పాఠశాలల డైట్ చార్జీలు పెంచడంతో మెనూలో కూడా మార్పు చేసిన విషయమై విద్యార్ధినిలను అడిగి తెలుసుకున్నారు. ఈ బోజనంతో సంతృప్తిగా ఉన్నారా? లేదా తెలుసుకున్నారు.
నెలలో ఆరుసార్లు నాన్ వెజ్, నాన్‌వెజ్ లేని రోజున గుడ్డును పెడతారన్నారు. పాఠశాలలోని వంట గదిని, వంటకు ఉపయోగించుకునే సామాగ్రీని, పప్పు దినుసులు, బియ్యం, వంట నూనేలను ఆమె పరిశీలించారు. కలెక్టర్ విద్యార్ధినిలతో కలిసి బోజనం చేశారు. బోజనం చేస్తున్నంత సేపు విద్యార్ధినిలతో మాట్లాడుతూ గడిపారు. విద్యార్ధినిలు కూడా కలెక్టర్‌తో కలిసి బోజనం చేయడంతోపాటు అరగంటపాటు ఫేస్‌టు ఫేస్ మాట్లాడుకునే అవకాశం కలగడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. వంట గది శుభ్రంతో పాటు భోజనం వండే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, వడ్డించే సమయంలో హెడ్‌క్యాప్, హ్యండ్ గ్లౌజ్‌లు ధరించాలని సూచించారు. ఆర్‌డీవో పాండు, మండల ప్రత్యేకాధికారి గీతా, ఎంపీడీవో రాజేష్, ఎంఈవో కృష్ణ, ఇంచార్జీ ప్రిన్సిపాల్ సౌజన్యతో పాటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయునిలు కలెక్టర్ వెంట ఉన్నారు. 19జెజిపి02ఏః జోగిపేట గురుకుల పాఠశాలలో వస్తువులను పరిశీలిస్తున్న కలెక్టర్ క్రాంతి