by Suryaa Desk | Sat, Dec 28, 2024, 02:37 PM
ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు, గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులు అర్పించారుఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రెండు రోజులపాటు టోకెన్ సమ్మె పిలుపులో భాగంగా ముస్తాబాద్ మేజర్ పంచాయతీ కార్యాలయం.
ముందు మండల గ్రామ పంచాయతీ కార్మికులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మృతి వల్ల కార్యక్రమాలలో మార్పు చేసుకొని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పైన చర్చించి పెండింగ్ వేతనాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని గ్రామపంచాయతీ కార్మికులు తరలిరావాలని జిల్లా సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కొడెం రమణ. నాయకులు అన్నల్ దాసు గణేష్. బిక్షపతి. లక్ష్మణ్ గ్రామపంచాయతీ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.