|
|
by Suryaa Desk | Mon, Mar 24, 2025, 03:52 PM
తానా సభలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే తానా సభలు ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డెట్రాయిట్ లో జరగనున్నాయి. ఈ క్రమంలో తానా 24వ సభలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తానా ప్రతినిధులు ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లో ఉన్న రేవంత్ నివాసానికి వెళ్లిన తానా ప్రతినిధులు ఆయనకు ఆహ్వానపత్రికను అందించారు. రేవంత్ ను కలిసిన వారిలో తానా కాన్ఫరెన్స్ ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, మాజీ అధ్యక్షుడు కోమటి జయరామ్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి ఉన్నారు. ఇప్పటికే ఈ కాన్ఫరెన్స్ కు హాజరుకావాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందించారు. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలకు కూడా ఆహ్వానపత్రికలు అందించారు.