![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 10:20 AM
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ లోని మసీదులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి, ఉపవాస దీక్ష విరమించ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బాలనాగయ్య, మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్, డి. రమేష్, హఫీస్ సాబు, రుక్మద్దిన్ బంగిస, షాపుద్దీన్, ఎండీ. నజ్జు, తదితరులు పాల్గొన్నారు.