|
|
by Suryaa Desk | Mon, Nov 10, 2025, 03:57 PM
అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును కవిత తప్పుబట్టారు. ఏ సమస్యలనైతే లేవనెత్తి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో, రెండేళ్లయినా అవేవీ పరిష్కారం కాలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ వెంటనే ప్రకటించాలని, గ్రూప్స్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తుపాన్ బాధితులకు సాయం అందించడంలో, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతానికి తాను ప్రజా సమస్యలపైనే దృష్టి పెడుతున్నానని, ప్రత్యక్ష రాజకీయాలు చేయాలనుకోవడం లేదని కవిత తెలిపారు. అయితే, ఎన్నికలకు ఏడాది ముందు తన రాజకీయాలు కచ్చితంగా ఉంటాయని, 'ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా'నని వ్యాఖ్యానించారు. రాజకీయ నేపథ్యం లేని మహిళలకు కూడా అవకాశాలు రావాలని ఆమె ఆకాంక్షించారు.