|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 04:07 PM
కులతత్వ విషాన్ని చిమ్మేవారిని, ముస్లిం లీగ్-మావోయిస్టు భావజాలం కలిగిన వారిని బీహార్ ప్రజలు తిరస్కరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సూరత్‌లో స్థిరపడిన బీహారీలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దశాబ్దకాలంగా ఓటములపై కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ముస్లింలీగ్-మావోయిస్టు కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో పనిచేసిన కాంగ్రెస్ జాతీయ నాయకులు కూడా రాహుల్ గాంధీ వ్యవహారశైలితో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు, కార్యకర్తలకు కూడా పరాజయం గురించి వివరించే పరిస్థితి ఆ పార్టీలో లేదని ఆయన విమర్శించారు.ఈవీఎంలు, ఎన్నికల సంఘం, ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను నిందించే సులభ మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకుందని ఆయన అన్నారు. కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వారిని ప్రజలు తిరస్కరిస్తారని బీహార్ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని ఆయన అన్నారు.