|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 04:08 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పలు సర్వేల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలం కంటే నవీన్ యాదవ్ ప్రాబల్యం ఎక్కువని తేలిందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకే బలం ఉంటే అజారుద్దీన్‌కు తిరిగి టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.గతంలో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్‌కు టిక్కెట్ ఇవ్వడం ద్వారా, మీకు గెలుస్తామనే విశ్వాసం లేదని స్పష్టమవుతోందని అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి చెందిన గణేశ్‌ను తీసుకువచ్చి టిక్కెట్ ఇచ్చారని, కానీ గద్దర్ కుమార్తెకు మాత్రం టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. సొంత పార్టీలో ఉన్నవారిని విస్మరిస్తూ బీజేపీ, మజ్లిస్ పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్ ఇచ్చారని ఆరోపించారు.జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి గెలవలేదని, నవీన్ యాదవ్ గెలిచారని ఆయన అన్నారు. తాను అమలు చేసిన పథకాల వల్లే గెలిచానని రేవంత్ రెడ్డి భావిస్తే అది పొరపాటు అని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉందని, గెలుపోటములు సహజమని ఆయన పేర్కొన్నారు.