|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 04:32 PM
తెలుగు సినీ పరిశ్రమ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ తన సేవలను శాశ్వతంగా నిలిపివేసింది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, "మీరు ఇటీవల మా గురించి విని ఉండవచ్చు లేదా మొదటి నుండి మాకు నమ్మకమైన అభిమానిగా ఉండవచ్చు. ఏదేమైనా, మీ దేశంలో మా సేవలు శాశ్వతంగా నిలిపివేయబడ్డాయని చెప్పడానికి మేము చింతిస్తున్నాము. నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాము" అనే సందేశం కనిపిస్తోంది. ఈ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి, కరీబియన్ దీవులలో నివసిస్తూ ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నాడు. కొత్త సినిమాల మాస్టర్ ప్రింట్లను దొంగిలించి వాటిని అప్‌లోడ్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. అయితే, తన భార్యతో విడాకుల ప్రక్రియ కోసం భారత్‌కు వచ్చినప్పుడు ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కూకట్‌పల్లిలోని అతని నివాసంలో రవిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం, పోలీసులు రవి చేతే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను పూర్తిగా మూసివేయించారు.