|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 04:36 PM
సౌదీ అరేబియాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా హైదరాబాద్ వాసులేనని సమాచారం. మృతుల్లో 18 మంది పాతబస్తీలోని మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారేనని అధికారులు తెలిపారు. దీంతో మల్లేపల్లి బజార్ ఘాట్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి.ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వీరంతా మక్కా యాత్రకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున మక్కా నుంచి మదీనా వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయని, ప్రయాణికులు తేరుకునేలోపే వారిని మంటలు చుట్టుముట్టాయని సమాచారం. బదర్– మదీనా ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన 45 మందిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు.