|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 04:48 PM
హైదరాబాద్ నగరంలోని కీలక ప్రాంతమైన గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. సంధ్య కన్వెన్షన్ సమీపంలో అనుమతులు లేకుండా నిర్మించిన పలు కట్టడాలను ఈరోజు కూల్చివేశారు.వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఇటీవల స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు అక్రమ నిర్మాణాలు తొలగించాలని హైడ్రాకు సూచించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం హైడ్రా అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన నాలుగు షెడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు. ఈ కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.