|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:20 PM
సంగారెడ్డి పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్ , యూత్ కాంగ్రెస్ రాజేష్ సంగమేశ్వర్ తన అనుచరులతో కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి సమక్షంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేసే నాయకులకు సరైన గుర్తింపు లేదని, అంతర్గతంగా స్వార్థ రాజకీయాలు పెరిగిపోయాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ధిని పట్టించుకోని పార్టీలో కొనసాగడం వృథా అని భావించి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే పార్టీ ఇదేనని అన్నారు. సునీల్ లాంటి అనుభవజ్ఞుల చేరికతో సంగారెడ్డి పట్టణంలో బిఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. కార్యకర్తల పట్ల అహంకారం తో, హేళనగా మాట్లాడం వారి విజ్ఞతకే వదిలేస్తున్న. రానున్నది మన బిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది.