|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 06:27 PM
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోకు అఖండంగా తరలివచ్చిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాను మంత్రి కోమటిరెడ్డి .కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే పేద ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగవంతమైంది. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ చీరలు, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొస్తున్నాయి.నల్లగొండను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్పు చేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, 24 గంటల తాగునీరు, రూ.700 కోట్ల బైపాస్ రోడ్డు వంటి పనులతో నల్లగొండను మహానగరంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నాం.ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు అన్ని డివిజన్లలో పార్టీ అభ్యర్థులను రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. చేయి గుర్తుకు ఓటు వేసి నల్లగొండ అభివృద్ధికి మద్దతు తెలపండి.