|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 06:25 PM
తెలంగాణలోని ఇళ్లు లేని నిరుపేదలకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేసి అర్హులందరికీ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి పట్టణ కార్పొరేషన్ ఇవ్వాలని, తమను గెలిపిస్తే కరీంనగర్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత 10 ఏళ్లలో 600 డబుల్ బెడ్ రూం ఇళ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయని విమర్శించారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత 10 ఏళ్లలో మొత్తం నియోజకవర్గంలో 600 డబుల్ బెడ్ రూం ఇండ్లు అసంపూర్తిగా నిర్మించి ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తామ అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి అర్హత కలిగిన వారందరికీ ఇస్తామన్నారు. ఏడాదిలోనే నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. రేషన్ కార్డులుతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో అమలు చేస్తున్నామన్నారు.