|
|
by Suryaa Desk | Sun, Feb 08, 2026, 06:23 PM
ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే మొదటి విడత మంజూరు చేశామని, వచ్చే ఏప్రిల్లో రెండవ విడత మంజూరు చేస్తామని వెల్లడించారు. మరో మూడు విడతల్లో అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లో ఆదివారం జరిగిన 'ప్రజాపాలన-ప్రగతి బాట' సభలో ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు.