విజయనగరం జిల్లా విజిలెన్స్ & మోనిటరింగ్ కమిటీ సభ్యుడిగా చేయూత ఫౌండేషన్ సొసైటీ అధ్యక్షులు రాము నియమించిన సందర్భంగా ఆదివారం రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ & ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. చేయూత ఫౌండేషన్ సొసైటీ అధ్యక్షులు ఎం. రాము చేస్తున్న విశేషమైన సేవలను గుర్తిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర మంత్రికి ధన్యవాదములు తెలియజేశారు.