by Suryaa Desk | Mon, Jan 20, 2025, 04:07 PM
ఇటీవలే అక్కినేని నాగచైతన్య, శోభితల పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కొద్దిమంది బంధువులు, అతిథుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇప్పుడు మరోసారి అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ తన ప్రేయసి జైనాబ్ ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య పెళ్లి సమయంలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. దీని సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అఖిల్, జైనాబ్ ల పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మార్చి 24న పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. అఖిల్ పెళ్లిని గ్రాండ్ గా జరిపేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్లను కూడా ఆహ్వానించనున్నారు. గతంలో అఖిల్ కు ఒక అమ్మాయితో ఎంగేజ్ మెంట్ జరిగింది. అయితే, అది పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. పెళ్లికి ముందే ఇద్దరూ బ్రేకప్ అయ్యారు.
Latest News