by Suryaa Desk | Mon, Jan 20, 2025, 04:10 PM
మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బరోజ్ త్రీడీ’. డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీసు రాజు డి గామా వంశానికి చెందిన నిధి చుట్టూ సాగే కథ ఇది. రాజుకి నమ్మిన బంటు అయిన బరోజ్ (మోహన్ లాల్) నాలుగు శతాబ్దాలుగా నిధిని కాపాడుతూ వస్తుంటాడు. డి గామా వారసులు వస్తే వాళ్లకి నిధిని అప్పగించాలని ఎదురు చూస్తుంటాడు. ఎట్టకేలకి రాజవంశం పదమూడో తరానికి చెందిన ఇసబెల (మాయా రావు) తన తండ్రితో కలిసి గోవా వస్తుంది. మరి ఆమెకి బరోజ్ నిధిని అప్పగించాడా లేదా? నాలుగు వందల ఏళ్లుగా బరోజ్ ఆ నిధిని ఎలా కాపాడుతూ వచ్చాడు? ఇసబెల రాజవంశానికి చెందిన యువతి అని అతడికి ఎలా తెలిసింది? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Latest News