by Suryaa Desk | Mon, Jan 20, 2025, 08:15 PM
సైఫ్ అలీఖాన్‌పై దాడి నేపథ్యంలో ఆయన సతీమణి కరీనా కఫూర్ మరోసారి స్పందించారు. దాడికి సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాలు, వీడియోలపై ట్విటర్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ఛానల్ సృష్టించిన వీడియోను ఓ నటుడు సోషల్ మీడియో షేర్ చేయగా ఆమె రియాక్ట్ అయ్యారు. ‘దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి’ అంటూ పోస్టు పెట్టారు. అయితే కొన్ని క్షణాల్లోనే దాన్ని డిలీట్ చేయడం గమనార్హం.ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన దుండగుడు ఆయనపై దాడి చేసిన సంగతి తెలిసిందే. కత్తిపోట్లకు గురైన నటుడు ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్ కోలుకున్నప్పటికీ నేడు డిశ్చార్జ్ చేయడంలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.. వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఇంకా ఉండాలని పేర్కొన్నాయి. మరోవైపు, ఈ కేసు విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు కస్టడీలో ఉన్నాడు.
Latest News