బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 09:12 PM
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జీవన్ రెడ్డికి చెందిన మాల్ కు సంబంధించి నోటీసులు జారీ చేశారు. రూ.8 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ఏ క్షణంలోనైనా సీజ్ చేస్తామని ఈ మాల్ ఎదుట ఉన్న మైక్ లో ప్రకటించారు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్‌లోని వ్యాపారులు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాల్‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మాల్‌కు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. విద్యుత్ శాఖకు రూ.2 కోట్ల బకాయిలు ఉండడంతో ముందుగా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో కరెంటు నిలిపివేసినట్లు వెల్లడించారు.