|
|
by Suryaa Desk | Thu, Dec 19, 2024, 04:34 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని రెవెన్యూ సర్వే నెంబర్ 75లో గల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న నిరుపేదల ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలని కోరుతూ బుధవారం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. స్థలాలకు పట్టాలు మంజూరు చేసి పలు సదూపాయాలు కల్పించాలని కోరారు.
మంత్రికి వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు టీ రామకృష్ణ, మండల కార్యదర్శి సత్తిరెడ్డి, జిల్లా సమితి సభ్యుడు కే చందు యాదవ్, మహిళ సమైక్య నాయకురాలు లక్ష్మీ తదితరులు ఉన్నారు.