|
|
by Suryaa Desk | Thu, Dec 19, 2024, 04:37 PM
అదానీపై జేపీసీ విచారణ, మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసీసీ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ నేతలతో కలిసి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ పామేన భీం భరత్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చల్ల నరసింహ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, మొయినాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాణెయ్య, నవాబు పేట్ బీ బ్లాక్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గణపురం ప్రసాద్, నాయకులు కృష్ణా రెడ్డి, నరసింహ రెడ్డి, కేబుల్ రాజు, సంజీవ రెడ్డి, మహేందర్, చిలుకూరు రాజు, ఎంపీటీసీ రామ్ రెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.