![]() |
![]() |
by Suryaa Desk | Sat, Dec 21, 2024, 06:34 PM
అసెంబ్లీలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని చెప్పినా వినకుండా థియేటర్లో సినిమా చూశాడని ఆరోపించారు. అల్లు అర్జున్ ను ఏం మనిషనుకోవాలి అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ మీడియా ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రాత్రి 7 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలకు ఆయన తన వివరణ ఇస్తారని భావిస్తున్నారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది