by Suryaa Desk | Sat, Dec 28, 2024, 02:20 PM
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో మంజీర నుంచి జరుగుతున్నఆక్రమ ఇసుక రవాణాకు బిచ్కుంధ సీఐ జగడం నరేష్, ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ ఇసుక రవాణా నడవకుండా అడ్డుకట్ట వేశారు. గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పటికీ అక్రమ ఇసుక రవాణా పోలీస్ అధికారుల చర్యలతో చాలావరకు సద్దుమణిగిందని పలువురు చర్చించుకుంటున్నారు.
పెట్రోలింగ్ నిర్వహణ పెంచి నది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుపుతున్న ఇసుక ట్రాక్టర్ల పై కేసులు నమోదు చేయడమే కాకుండా పెనాల్టీలు సైతం విధించడంతో అక్రమ ఇసుక రవాణా సద్దుమణిగిందనీ తెలియజేశారు. ఇకపై ఎవరైనా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినట్లయితే ట్రాక్టర్లను, టిప్పర్లను, జేసిబిలను సీజ్ చేసి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.