by Suryaa Desk | Sat, Dec 28, 2024, 02:24 PM
నెక్కొండ ఈరోజు నెక్కొండ మండల కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీని వంద శాతం మున్సిపాలిటీగా చేసి తీరుతామన్నారు గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డికి మునిసిపాలిటీగా ఏర్పాటు చేయడానికి గల ప్రొసీజర్ ఏంటో కూడా తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పథకం కేవలం గ్రామీణ ప్రాంతాల వరకు మాత్రమే పరిమితం అనే విషయము తెలిసి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు ఎన్నికల ముందు దొంగ జీవోలు తెచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుందామని చూసిన మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పటికీ మీ ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు దళిత బంధు పేరుతో కుట్టు మిషన్ల పేరుతో ఓటుకు 1500 రూపాయలు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూసిన మీకు మీ పరిపాలనపై ప్రజలకి ఎటువంటి విశ్వాసం లేకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగిందనే విషయం మర్చిపోవద్దన్నారు సమీక్షల పేరుతో అధికారులతో ఫోటోలకు మాత్రమే పరిమితమైన మీ పరిపాలనకు అభివృద్దే లక్ష్యంగా పని చేసే మా పరిపాలనకు చాలా తేడా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం సంవత్సర కాలంలోనే ఏల్గురు రంగంపేట నుండి చంద్రుగొండ క్రాస్ రోడ్ వరకు డబుల్ రోడ్డు పనులను 10 కోట్ల రూపాయలతో ప్రారంభమైన రోడ్డు పనులు కనిపించడం లేదా అన్నారు నెక్కొండ నుండి సాయిరెడ్డి పల్లి వరకు 7 మీటర్ల రోడ్డు నాలుగున్నర కోట్ల రూపాయలతో టెండర్ కూడా పూర్తయిన విషయం తెలుసుకోవాలన్నారు చిన్న కార్పోల్ నుండి పెద్దకోరుపోలు మధ్యలో గల వట్టేవాగు పై బ్రిడ్జి నిర్మాణానికి కూడా టెండర్లు పూర్తయిన విషయం కూడా తెలుసుకోవాలన్నారు నెక్కొండ నుండి చింత నెక్కొండ క్రాస్ రోడ్ వరకు నాలుగు లైన్ల రోడ్డు అదే విధంగా నెక్కొండ నుండి అమీన్పేట వరకు నాలుగు లైన్ల రోడ్లతో డివైడర్ సెంట్రల్ లైటింగ్ తో పనులకు సంబంధించి ప్రపోజల్ కూడా పంపడం జరిగింది త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయని అన్నారు.
నెక్కొండ నుండి ఇంటికన్నే వరకు కూడా డబుల్ రోడ్డు పనులు కు సంబంధించి త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులను ప్రారంభిస్తామన్నారు నెక్కొండ మండలానికి దాదాపు కోట్ల రూపాయల నిధులతో అంతర్గత రోడ్డు పనులను నిర్వహించామని తెలిపారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై నమ్మకంతో ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో గొప్పగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసి తీరుతామన్నారు ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కుసుమ చెన్నకేశవులు కొల్లి వెంకట సుబ్బారెడ్డి ఎండి అన్వర్ నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రావుల మహిపాల్ రెడ్డి బొమ్మరబోయిన రమేష్ ఈదునూరి సాయికృష్ణ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్ గడ్డం ఆనందం కక్కర్ల ఐలయ్య ఈదునూరి ప్రభాకర్ కక్కెర్ల నాగయ్య బత్తుల సుబ్బారెడ్డి మువ్వ వెంకటేశ్వర్లు వనం ఏకాంతం గట్ల వరుణ్ సంగని వెంకన్న వడ్డే సంతోష్ రామారపు రాము ముద్రబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.