|
|
by Suryaa Desk | Mon, Mar 24, 2025, 08:09 PM
BRS ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో ఆపరేషన్ సక్సెస్..పేషంట్ డెడ్ అనే తీరు సరికాదని చెప్పింది. BRS ఎమ్మెల్యేల ఫిరాయింపు అనర్హత పిటిషన్ల పెండింగ్‌పై మండిపడింది. అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి, హైకోర్టు రిజిస్టార్‌కు SC నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.అలాగే, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి, హైకోర్టు రిజిస్టార్‌కు నోటీసులు ఇచ్చింది. మార్చి 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పటి వరకు స్పీకర్, ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో, విచారణపై ఉత్కంఠ నెలకొంది.