![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 11:33 AM
రేపు హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు మంచి నాణ్యత కలిగిన బియ్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 85% జనాభాకు సన్న బియ్యం లభ్యత దొడ్డు బియ్యం వల్ల ఎదురైన సమస్యల పరిష్కారం బ్లాక్ మార్కెట్‌ని అరికట్టేందుకు కఠిన చర్యలు. ముఖ్యమంత్రి సూచనలతో రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యం మాత్రమే కాకుండా, ఇతర నిత్యావసర సరుకులు కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. త్వరలో కందిపప్పు, ఉప్పు, ఇతర నిత్యావసర వస్తువులు కూడా రేషన్ షాపుల ద్వారా లభిస్తాయని వెల్లడించారు. ఇప్పటి వరకు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు బియ్యం మాత్రమే సరఫరా అయ్యేది. అయితే, పేద ప్రజలకు మరింత మేలు చేయాలనే లక్ష్యంతో కందిపప్పు, ఉప్పు, వంటనూనె వంటి వస్తువులను కూడా రేషన్ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ప్రకటించారు.