![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 02:02 PM
అర్థరాత్రి వేళ ఓపెన్ టాప్ జీపులో తుపాకీతో హల్ చల్ చేసిన యువకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కొందరు యువకులు ఓపెన్ టాప్ జీపుపై ప్రయాణిస్తూ హంగామా సృష్టించారు. జీపు డ్యాష్‌బోర్డుపై తుపాకీ ఉంచి హల్ చల్ చేయడంతో పాటు, ఓ యువకుడు తన చేతిలో తుపాకీ పట్టుకుని గాల్లోకి ఊపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ యువకులే స్వయంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన నగర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. సోషల్ మీడియాలో వీడియోను చూసిన బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు ఆకతాయిలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు అఫ్సర్ అనే యువకుడిని గుర్తించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, వారు ఉపయోగించిన జీపును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆ యువకుడితో పాటు పాల్గొన్న వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది.ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, ప్రజల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. నగరంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.