|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 10:38 AM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాశమైలారం లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు, కోఆర్డినేటర్స్ శ్రీరంగం సత్యం, పారిజాత నర్సింహ రెడ్డి గారు, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ ఇంఛార్జి నీలం మధు గారు పాల్గొని 19వ వార్డు అభ్యర్థి సరిత సుధాకర్, 20వ వార్డు అభ్యర్థి జ్యోతి లక్ష్మారెడ్డి గార్లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.