|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:21 PM
మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ లో నివసిస్తున్న ప్రైవేటు ఉద్యోగి కుమారుడు, గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ రెండవ సంవత్సరం విద్యార్థి గంగాధరి అభినవ్ (17) తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 5న తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అభినవ్, ఫ్యాన్ కు చున్నితో ఉరివేసుకున్నాడు. యువతి వెంటనే అభినవ్ స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో, వారు ఇంటికి వెళ్లి డోర్ తెరిచి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.