|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:32 PM
ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 712 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని, సభలు, ర్యాలీలు, లౌడ్‌స్పీకర్లు, ఇంటింటి ప్రచారం నిషేధమన్నారు. అదే సమయం నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉండి, పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుమికూడరాదని హెచ్చరించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.