|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:37 PM
జగద్గురు ఆదిశంకరాచార్యులపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆదిశంకరాచార్యులు చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదని, ఆయన శుద్ధ వైష్ణవుడని చినజీయర్ పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో జరుగుతున్న సమతాకుంభ్ బ్రహ్మోత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.చినజీయర్ స్వామి తన ప్రవచనంలో "శంకరాచార్యులు పూరీ, ద్వారక, జ్యోతిర్మఠం, శృంగేరి పీఠాలను ఏర్పాటు చేయలేదు. ఆయన 32 ఏళ్లకే హిమాలయాలకు వెళ్లి తిరిగి రాలేదు. 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య స్థాపనకు మార్గనిర్దేశం చేసిన విద్యారణ్య స్వామి ఈ నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు. విదేశీ దండయాత్రల నుంచి హిందూ ధర్మాన్ని రక్షించేందుకు శైవం, వైష్ణవం వంటి అన్ని మార్గాల వారిని ఏకం చేయడానికి ఆయన పంచాయతనాన్ని పరిచయం చేశారు. ఆదిశంకరాచార్యులు ఉత్తమ వైష్ణవుడు, నారాయణ పరాయణుడు" అని వివరించారు.అయితే, చినజీయర్ వాదనపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1380-86 మధ్య శృంగేరి పీఠానికి విద్యారణ్య స్వామి 12వ పీఠాధిపతిగా ఉన్నారని, ఆయన కంటే ముందే ఆ పీఠం ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని పలువురు గుర్తుచేస్తున్నారు.