|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:40 PM
దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన 'యుఫోరియా' చిత్రంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా వాస్తవికతకు అద్దం పడుతోందని, యువతతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తప్పక చూడాల్సిన చిత్రమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించారు. "'యుఫోరియా' వాస్తవికతకు నిలువుటద్దం లాంటిది. కీలకమైన సామాజిక సమస్యలను ప్రస్తావించిన ఈ చిత్రం యువత, తల్లిదండ్రులు తప్పక చూడాలి" అని ఆయన పేర్కొన్నారు. ఈ సాహసోపేత ప్రయత్నం చేసిన దర్శకుడు గుణశేఖర్‌కు, చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.