|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 02:59 PM
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో నవ వధువుకు సర్పంచ్ బి. దత్తు ఆర్థిక సహాయం అందించారు. హాసన్ అలీ కూతురి వివాహ సందర్భంగా, సర్పంచ్ దత్తు తన వంతుగా రూ. 5000 నగదును పెళ్లి కూతురికి కానుకగా ఇచ్చారు. సర్పంచ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోకల రాజు, మండల అధ్యక్షుడు షేక్ ఇమామ్, మాజీ అధ్యక్షులు కంచం లక్ష్మణ్, సత్యశ్రీ హరిగౌడ్, రామారావు, గొర్బండ్ సందీప్, అజగర్, సంజయ్, ముక్రం, ఆనంద్, జమ్మ, రామన్న తదితరులు పాల్గొన్నారు.