|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 03:54 PM
ఎల్లారెడ్డి మున్సిపాలిటీని ఎన్నికల్లో దక్కించుకొని, రక్షించుకునే బాధ్యత తనదేనని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మున్సిపాలిటీకి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని, పెద్ద చెరువుకు ట్యాంక్ బాండ్, సివిల్ ఆసుపత్రి ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించానని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే వాటికి కలరింగ్ ఇచ్చి ఫోటోలకు ఫోజులిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి తెచ్చిన నిధుల జీవోలు చూపించాలని ప్రజల ముందు ఎమ్మెల్యేకు సవాలు విసిరారు.