|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 11:56 AM
బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ సీక్వెల్ ‘ధురంధర్ 2’ టీజర్‌ను నేడు మధ్యాహ్నం 12:12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం మార్చి 19, 2026న విడుదల కానుంది.సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనుండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు బాలనటి గా గుర్తింపు పొందిన సారా అర్జున్ ఈ చిత్రంలో ఒక సర్ప్రైజ్ రోల్‌లో కనిపించనుందని సమాచారం.ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ టీ-సిరీస్ భారీ మొత్తానికి సొంతం చేసుకోవడం విశేషం. టీజర్‌ను కూడా టీ-సిరీస్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లోనే విడుదల చేయనున్నారు. దీంతో టీజర్ రిలీజ్ సమయానికి లక్షలాది మంది వీక్షకులు ఆన్‌లైన్‌లో చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News