|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 12:29 PM
నటి కవిత తన సినిమా ప్రస్థానం, సూపర్ స్టార్ కృష్ణపై తనకున్న అభిమానం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలోనే కృష్ణ గారిని చూసి ఆయన లాంటి భర్త రావాలని కలలు కన్నానని, తనను తాను కృష్ణ గారికి పిచ్చి అభిమానిగా చెప్పుకున్నారు. విజయనిర్మల గారు కృష్ణ గారితో నటించేటప్పుడు, తన అభిమానం, గౌరవం వల్ల తాను బిగుసుకుపోయేదాన్ని, ఇతర హీరోలతో నటించినంత స్వేచ్ఛగా ఉండేదాన్నికాదని ఆమె అన్నారు. విజయనిర్మల తనను కపిత అని సరదాగా పిలిచేవారని, దానికి అర్థం కోతి లేదా అల్లరి అని కవిత అన్నారు. కృష్ణ గారు మితభాషి అయినప్పటికీ, గొప్ప మానవతావాది అని, అద్భుతమైన వ్యక్తి అని కవిత అన్నారు. ఆయన నేను తనకు పెద్ద అభిమాని అని చెప్పినా.. కేవలం అవునా అని మాత్రమే అని చిరునవ్వు నవ్వేవారని కవిత అన్నారు.
దర్శకుడు కె. రాఘవేంద్ర రావు సినిమాలలో హీరోయిన్‌గా నటించలేకపోవడం, దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో ప్రేమాభిషేకం ఒక్క సినిమాలోనే నటించడం తన కెరీర్‌లో ఉన్న నిరాశల్లో ఒకటని కవిత పేర్కొన్నారు. రాఘవేంద్ర రావు గారు తనను చిన్నపిల్లలా చూసేవారని చెప్పారు. తన కెరీర్ విజయాలలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు, ఆ సంవత్సరంలో తన సినిమాలు ఎక్కువగా విడుదలైన కారణంగా తనకు కళా సుందరి బిరుదును ప్రదానం చేశారని ఆమె సగర్వంగా తెలిపారు. అలాగే, 14 ఏళ్ల వయసులో, అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారి చేతుల మీదుగా తమిళంలో ఒక సినిమాకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నీలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతి అని తనకు తెలియదని, తెలుగు అమ్మాయిగా తమిళంలో అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన ఆశీర్వదించారని కవిత తెలిపారు.
Latest News