|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:17 PM
కొన్నేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న ఉత్తర భారత చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధిస్తోంది. దేశభక్తి ఇతివృత్తం బాలీవుడ్‌కు ప్రధాన విజయ సూత్రంగా మారింది. 'దురందర్' చిత్రం వెయ్యి కోట్లు వసూలు చేయగా, 'బోర్డర్ 2' చిత్రం ఐదు రోజుల్లో 350 కోట్లు సాధించి అదే జోరును కొనసాగించింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తిరిగి విజయాల బాట పట్టింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి తొలి రోజు రూ. 30 కోట్ల(నెట్) వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. కలెక్షన్స్ పరంగా చూస్తే.. తొలి రోజే ఈ చిత్రం ‘ధురంధర్’ని బీట్ చేసింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ చిత్రానికి తొలి రోజు రూ. 28 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక దేశ వ్యాప్తంగా దురంధర్ తొలిరోజు 6,146 షోస్ పడితే.. బోర్డర్ 2కి 6000 మాత్రమే పడ్డాయి. అయినా కూడా కలెక్షన్స్ పరంగా బోర్డర్ 2 చిత్రమే టాప్‌లో ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. వీకెండ్‌లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News