|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 04:07 PM
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రఘునాథరెడ్డి కన్నుమూశారు. నెల రోజుల క్రితమే కుమారుడు గుండెపోటుతో మరణించడంతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. అదే బాధతో శనివారం రాత్రి ఆయనకు కూడా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. రఘునాథరెడ్డి సుమారు 350 చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రఘునాథ్ రెడ్డి. సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు.అలాగే నెగిటివ్ రోల్స్ లోనూ నటించి అలరించారు. సుమారు 370కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు రఘునాథ్ రెడ్డి. తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ బోజ్ పురి సినిమాలలో కూడా నటించి మెప్పించారు. రఘునాథ్ రెడ్డి కన్నుమూయడంతో సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రఘునాథ్ రెడ్డి మరణ వార్త తెలిసి పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Latest News