|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 04:04 PM
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రాంతీయ భాషా చిత్రాల్లో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సంచలన వసూళ్లు. మన శంకర వరప్రసాద్ గారు తొలి వారం రికార్డు స్థాయిలో బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. మొదటి వారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 187 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. రెండో వారంలో 24 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు వారాల్లో 210 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.ఇక మూడో వారంలో కూడా ఈ సినిమా స్టడీగా వసూళ్లను సాధిస్తున్నది. ప్రతీ రోజు కోటి రూపాయలకుపైగా కలెక్షన్లను నమోదు చేస్తున్నది. మూడో శుక్రవారం ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు, శనివారం అంటే 20వ రోజు 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వారాంతంలో ఈ సినిమా బెటర్‌గా నిలకడగా వసూళ్లను సాధిస్తుండటంతో మరో వారం ఈ సినిమా ఆంధ్రా, నైజాం బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత 20 రోజుల్లో శంకర వరప్రసాద్ చిత్రం ఆంధ్రా, నైజాంలో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం నైజాంలో 45.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సీడెడ్‌లో 23 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 22 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 15.5 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 10 కోట్ల రూపాయలు, గుంటూరులో 11 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 11 కోట్ల రూపాయలు, నెల్లూరులో 6.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతోఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 218 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Latest News