|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:21 PM
నటుడు శర్వానంద్ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో ప్రేక్షకులను అలరించి హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆయన, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాబోయే ‘బైకర్’ సినిమా కోసం 18 ఏళ్ల యువకుడిగా కనిపించాల్సి రావడంతో రెండేళ్లలో 22 కిలోల బరువు తగ్గానని తెలిపారు. కేబీఆర్ పార్క్‌లో రన్నింగ్, జిమ్, కఠిన ఆహార నియమాలతో ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. సంక్రాంతి తనకు బాగా కలిసి వస్తోందని, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’, ‘నారీ నారీ నడుమ మురారి’తో పొంగల్ హ్యాట్రిక్ సాధించిన ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే సంక్రాంతికి శ్రీనువైట్ల దర్శకత్వంలో మరో సినిమాతో రానున్నట్లు వెల్లడించారు. ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను బాలకృష్ణ అనుమతితోనే వాడుకున్నామని, ఆయన ఆశీర్వాదం తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. చిరంజీవే తనకు ప్రేరణ అని, ‘స్వయంకృషి’ సినిమా తనను నటన వైపు నడిపించిందని గుర్తు చేసుకున్నారు.
Latest News