|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:26 PM
ప్రముఖ సినీ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపల గుర్తు తెలియని దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ముంబై జుహులోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను మోహరించారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశం ఇంకా తెలియరాలేదని, నిందితులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.గుర్తుతెలియని వ్యక్తులు రోహిత్ శెట్టి నివసిస్తున్న బిల్డింగ్‌పై కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఐదు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదని వెల్లడించారు. ఇక, ఈ సంఘటనపై స్థానిక పోలీసులతోపాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Latest News